మిల్లర్ డకౌట్.. 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్

ABN , First Publish Date - 2021-04-23T01:31:49+05:30 IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ దారుణ ప్రదర్శన చేస్తోంది. 18 పరుగులకే 3 వికెట్ల కోల్పోయి..

మిల్లర్ డకౌట్.. 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ దారుణ ప్రదర్శన చేస్తోంది. 18 పరుగులకే 3 వికెట్ల కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. మూడో వికెట్‌గా ఫాంలో ఉన్న డేవిడ్ మిల్లర్(0) డకౌట్ కావడం రాజస్థాన్‌కు భారీ దెబ్బ తగిలింది. ఇక ఇప్పటికే ఓపెనర్లు మనన్ వోహ్రా(7: 9 బంతుల్లో.. 1 ఫోర్), జోస్ బట్లర్(8: 8 బంతుల్లో.. 2 ఫోర్లు) వెంటవెంటనే అవుట్ కావడంతో ఒత్తిడిలో ఉన్న జట్టుకు మిల్లర్ అవుట్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం క్రీజులో సంజు శాంసన్(3), శివమ్ దూబే(0) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-04-23T01:31:49+05:30 IST