అమెరికాలో లక్షన్నర సీసీ కెమెరాల హ్యాక్‌

ABN , First Publish Date - 2021-03-11T10:58:47+05:30 IST

అమెరికాలో దాదాపు లక్షన్నర సీసీ కెమెరాలను హ్యాకర్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ప్రధానంగా ‘వర్కడ’ కంపెనీ తయారు చేసిన సీసీ కెమెరాలపై వారు పంజా విసిరారు. హ్యాకర్ల నియంత్రణలోకి వచ్చిన

అమెరికాలో లక్షన్నర సీసీ కెమెరాల హ్యాక్‌

వాషింగ్టన్‌, మార్చి 10: అమెరికాలో దాదాపు లక్షన్నర సీసీ కెమెరాలను హ్యాకర్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ప్రధానంగా ‘వర్కడ’ కంపెనీ తయారు చేసిన సీసీ కెమెరాలపై వారు పంజా విసిరారు. హ్యాకర్ల నియంత్రణలోకి వచ్చిన సీసీ కెమెరాల్లో.. పోలీసు శాఖ, జైళ్లు, ఆస్పత్రులు, స్కూళ్లతోపాటు.. దిగ్గజ కార్ల కంపెనీ టెస్లా, క్లౌడ్‌ సేవలను అందజేసే టెక్‌ కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్‌ వంటివి కూడా ఉన్నాయి. హ్యాకర్లు పలు వీడియోలను విడుదల చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘హ్యాకింగ్‌పై ఆసక్తితోపాటు.. సమాచార స్వాతంత్య్రం కోరుకుంటున్నాం. మేథోసంపత్తిపై వ్యతిరేకత, పెట్టుబడిదారీ విధానానికి, అరాచకత్వానికి నిరసనగా ఈ చర్యకు పాల్పడ్డాం. అంతేకాదు.. మేము హ్యాక్‌ చేసిన లక్షన్నర సీసీ కెమెరాలకు సంబంధించిన పాత ఫుటేజీని సైతం యాక్సెస్‌ చేయగలం’’ అని ఆ వీడియోలో తనను తాను కోట్‌మన్‌గా పరిచయం చేసుకున్న ఓ హ్యాకర్‌ వివరించాడు. 


Updated Date - 2021-03-11T10:58:47+05:30 IST