రామకృష్ణ మఠంలో ‘మైండ్ మేనేజ్‌మెంట్’పై ఆన్ లైన్ క్లాసులు

ABN , First Publish Date - 2020-10-30T22:02:06+05:30 IST

మనిషి మేధను, మనస్సును సమతుల్యం చేస్తే అఖండ విజయాలు సాధించొచ్చు. ఈ విషయాన్ని వేల ఏళ్లుగా ఎందరో మహానుభావులు నిరూపించారు.

రామకృష్ణ మఠంలో ‘మైండ్ మేనేజ్‌మెంట్’పై ఆన్ లైన్ క్లాసులు

హైదరాబాద్: మనిషి మేధను, మనస్సును సమతుల్యం చేస్తే అఖండ విజయాలు సాధించొచ్చు. ఈ విషయాన్ని వేల ఏళ్లుగా ఎందరో మహానుభావులు నిరూపించారు. అందులో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి మహనీయులు ఉన్నారు. వారి బోధనలు వినడం ద్వారా మనస్సు, మేధను సమతుల్యం చేయొచ్చని అంటోంది రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’. ‘మైండ్ మేనేజ్‌మెంట్’ పేరిట ఆన్ లైన్‌లో క్లాసులు నిర్వహించనున్నది. ఈ తరగతులు  నవంబర్ 2 నుంచి నవంబర్ 7 వరకు ఆరు రోజుల పాటు జరగనున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6.15 నుంచి 7.15 గంటల వరకు క్లాసులు ఆన్ లైన్‌లో జరగనున్నాయి. 16 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. 


ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు. 


మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.


రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Updated Date - 2020-10-30T22:02:06+05:30 IST