మైనింగ్‌ ‘రాయల్టీ’ మోత

ABN , First Publish Date - 2021-06-14T05:47:44+05:30 IST

ఒడిదుడకులలో ఉన్న గ్రానైట్‌ పరిశ్రమపై ప్రభుత్వం మైనింగ్‌ రాయల్టీని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రానైట్‌ ఫ్యాక్టరీ, క్వారీ యజమానులలో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా ప్ర భావంతో తీవ్ర నష్టాలలో ఇప్పటికే పలు పరిశ్రమలు మూతపడ్డాయి. ఇప్పుడు రాయల్టీ పెంచితే పూర్తి స్థాయి లో మూతపడక తప్పదని వారు వాపోతున్నారు.

మైనింగ్‌ ‘రాయల్టీ’ మోత
బల్లికురవ ప్రాంతంలోని గ్రానైట్‌ ఫ్యాక్టరీ

50 శాతం వరకు పెంచుతూ ఉత్తర్వులు 

గ్రానైట్‌ యజమానుల ఆందోళన

ప్రభుత్వం  దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు సన్నాహాలు


 బల్లికురవ, జూన్‌ 13:  ఒడిదుడకులలో ఉన్న గ్రానైట్‌ పరిశ్రమపై ప్రభుత్వం మైనింగ్‌ రాయల్టీని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రానైట్‌ ఫ్యాక్టరీ, క్వారీ యజమానులలో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా ప్ర భావంతో తీవ్ర నష్టాలలో ఇప్పటికే పలు పరిశ్రమలు మూతపడ్డాయి. ఇప్పుడు రాయల్టీ పెంచితే పూర్తి స్థాయి లో మూతపడక తప్పదని వారు వాపోతున్నారు. 50 శా తం రాయల్టీ పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేయటంతో గత మూడు రోజుల నుంచి గ్రానైట్‌  పరిశ్ర మల యజమానులు వీటిని నిర్వహించడం ఇక కష్టమని మనోవేదన చెందుతున్నారు. గత ఏడాది నుంచి పరిశ్రమ లు ఒడిదుడుకలలో ఉన్నాయని, ఇప్పుడు ఏకంగా రా యల్టీ పెంచటం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నా రు. విద్యుత్‌ బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో కొందరు యజమానులు ఉన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రా ష్ట్రంలో రాయల్టీ చాలా తక్కువగా ఉందని  వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాద యాత్రలో గ్రానైట్‌ పరిశ్రమల యజమానులను ఆదుకుం టామనని చెప్పిన  విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.


బల్లికురవ ప్రాంతంలో 700 ఫ్యాక్టరీలు


బల్లికురవ, మార్టురు, సంతమాగులూరు మండలాల పరిధిలో 700వరకు గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి.  50 వ రకు గ్రానైట్‌ క్వారీలు ఉన్నాయి.  వీటిద్వారా సుమారు 10వేల మంది వరకు కార్మికులు ఉపాధి పొందుతున్నా రు. గత రెండు నెలల నుంచి 50 శాతం వరకు గ్రానైట్‌ ఫ్యాక్టరీలు కరోనా లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. పరిశ్రమల నిర్వహణ యజమానులకు భారంగా మారింది. పెరిగిన ఖర్చులతో వారు ఆందోళనలో ఉన్నారు. తాజాగా ప్రభు త్వం మైనింగ్‌ రాయల్టీ పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వటంతో  పరిశ్రమలు నిర్వహించటం కష్టం అని అంటున్నారు. రా యల్టీ పెంపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ తామని వారు తెలిపారు


రాయల్టీ పెంపు పెనుభారం


మైనింగ్‌ రాయల్టీ పెంపు పరి శ్రమలకు పెనుభారం అవుతుం ది. ఇప్పటికే పలు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. విద్యుత్‌ బిల్లు లు కూడా చెల్లించలేని స్దితిలో ఉన్నాం. ఒకేసారి 50 శాతం రా యల్టీ పెంపు నిర్ణయం తమను ఆందోళనకు గురిచేస్తు ంది. ఈవిషయాన్ని అందరం సమష్టిగా మాట్లాడుకొని ప్రభుత్వం దృష్టికి సమస్యని తీసుకెళతాం. కరోనాతో గ్రా నైట్‌ పరిశ్రమలలో ఎగుమతులు కూడా నిలిచిపోయా యి. కార్మికులు కూడా స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

- చిట్టిపోతు మస్తానయ్య


Updated Date - 2021-06-14T05:47:44+05:30 IST