ఎంపీడీవో కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్న అభ్యర్థులు
నిరుద్యోగ అభ్యర్థుల అసహనం
తుమ్మపాల: మినీ ట్రక్కుల కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలకు అధికారులు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. టెంట్‌లు, కుర్చీలు వేయకపోవడంతో అధికారులు పిలిచేంత వరకు కార్యాలయ ఆవరణలోనే పడిగాపులు కాశారు. కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో మెయిన్ రోడ్డుపైన దుకాణాల వద్ద పరుగులు తీశారు. దీంతో అధికారుల తీరును అభ్యర్థులు తప్పు పట్టారు.