Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంటలకు కనీస మద్దతు ధర కలిపించాలని కోరాం: గల్లా జయదేవ్

ఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర కలిపించాలని కోరామని టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్ తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నుంచి గల్లా జయదేవ్, కనకమేడల హాజరైనారు. విశాఖ స్టీల్స్‌, ఇతరసంస్థల ప్రైవేటీకరణ చేయవద్దని కోరారు. రాజధానుల విషయంలో అనిశ్చితి తొలగించి... అమరావతినే రాజధానిగా కొనసాగేలా చూడాలన్నారు. వరదల ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటించకుండా.. కేవలం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారని టీడీపీ ఎంపీలు తప్పుబట్టారు. ఆర్ధికంగా దివాళా తీసిన ఏపీని గాడిలో పెట్టాలని సభలో కోరామని, చర్చల సమయంలో రాష్ట్ర సమస్యలను వివరిస్తామని కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్ తెలిపారు.

Advertisement
Advertisement