Advertisement
Advertisement
Abn logo
Advertisement

జేసీబీ ఆపరేటర్లకు కనీస వేతన చట్టాన్ని అమలుచేయాలి

- ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం


పాలమూరు, నవంబరు 30 : జేసీబీ ఆపరేటర్స్‌కు సమగ్రమైన కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవోస్‌ భవనంలో యూనియన్‌ నాయకుడు సి.వెంకటేష్‌ అధ్యక్షతన ఏర్పాటుచేసిన జేసీబీ ఆపరేటర్స్‌ విస్తృత స్థాయి సమావేశానికి సూర్యం హాజరై, మాట్లాడారు. దేశంలో సుమారు 40కోట్ల అసంఘటిత కార్మికుల్లో 36కోట్ల మందికి సాంఘిక భద్రత లేదన్నారు. అసంఘటిత కార్మికులకు కనీస వేతన జీవోలు దాదాపు 73 ఉన్నాయని, ఈ జీవోలను పెరుగుతున్న ధరలకనుగుణంగా సవరణ చేయ కుండా కంపెనీ యజమానులకు అనుకూలమైన చట్టాలను తీసుకురావడం, 44 చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చడం శోచనీయమన్నారు. అనంతరం జేసీబీ ఆపరేటర్ల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వెంకటేష్‌, ఉపాధ్య క్షులుగా నరేష్‌, విష్ణు, కార్యదర్శిగా సాంబశివుడు, సహాయ కార్యదర్శిగా రాజు, సంతోష్‌, కోశాధికారిగా కొండయ్యతో పాటు, 21మంది సభ్యులను ఎన్ను కున్నారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు జేఎన్‌.దేవదానం, ఎస్‌.కిరణ్‌, బాలు, తిరుపతయ్య, రాఘవేందర్‌, ఆంజనేయులు, వేణు, శ్రీకాంత్‌, భాష, శేఖర్‌, మహేష్‌, రాము, వెంకటేష్‌లు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement