విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ దందా

ABN , First Publish Date - 2020-07-15T00:33:41+05:30 IST

ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా? ఇది పోకిరి సినిమాలోని పాపులర్ డైలాగ్. విశాఖ ఏజెన్సీలో ..

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ దందా

ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా? ఇది పోకిరి సినిమాలోని పాపులర్ డైలాగ్. విశాఖ ఏజెన్సీలో మైనింగ్‌లోనూ ఈ డైలగ్‌ను అన్వయించుకుంటున్నారు. కుదిరితే లైసెన్స్.. కుదరకపోతే బినామీ.. కాదంటే బెదరింపులు. దీంతో ఇక్కడి గిరిజనుల బాక్సైట్ తరహా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. అతని ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలో ఉన్న వారంతా మైన్ తవ్వుకుంటూ జీవనం గడిపేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైన్ ఓనర్‌ను పిలిచి ఆ మైన్ తమ పేరు మీద ఇచ్చేయాలని కోరారు. 


విశాఖ భవిష్యత్తులో పాలనా రాజధాని కాబోతోంది. అయితే  ఏ నగరానికి లేని ప్రత్యేకత. ఈ నగరానికి ఉంది. నగరంలో గ్రామీణంతో పాటుగా ఏజెన్సీ ప్రాంతం ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చాలా మండలాల్లో ఖనిజ సంపద నిక్షిప్తమైంది. దీన్ని దక్కించుకునేందుకు ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో ప్రధానమైంది బాక్సైట్. ప్రజాగ్రాహానికి వెనుకంజ వేయడం తప్పితే మారో మార్గం లేక ప్రస్తుతం బాక్సైట్  తవ్వకం ఆగిపోయింది. 


విశాఖ జిల్లా వ్యాప్తంగా 162 మైనింగ్ లీజులు ఉన్నాయి. మేజర్ మైనింగ్ దేనికీ అనుమతులు ఇవ్వలేదు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా బాక్సైట్‌తో పాటు కాలిసైట్, మైకా గ్రానైట్, చైనా క్లే, లాటిరైట్, క్వాడ్జ్, కలర్ గ్రానైట్, ఆర్అండ్ బిస్, గ్రావెల్ ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతలో అనుమతులు ఇవ్వడం అంత సులువైన పని కాదు. వీటికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి, గ్రామ సభలు నిర్వహించి అనుమతులు పొందాల్సి ఉంది. అయితే ఇక్కడొక లాజిక్ ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సొసైటీలకు, గిరిజన యువకులకు ఈ మైన్లు లీజ్ కు ఇచ్చేందుకు వెసులుబాటు ఉంది. దీన్ని అసరా చేసుకుని అమాయక గిరిజన పేరు మీదనే బడాబాబులు వీటిని పొందేందుకు ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తున్నారు. చాలా దరఖాస్తులు మైనింగ్ శాఖ దగ్గర ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో కొన్నింటికి అనుమతులు ఇస్తే...ఈ ప్రభుత్వంలో రూల్స్ తో సంబంధం లేకుండా చకచకా పావులు కదిపి  అధికారుల సహకారంతో అనుమతులు పొందేస్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-07-15T00:33:41+05:30 IST