పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం : ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-06-21T05:44:58+05:30 IST

పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం : ఎర్రబెల్లి

పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం : ఎర్రబెల్లి
రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి, మాట్లాడుతున్న దయాకర్‌రావు

నడికూడ, జూన్‌ 20: పేదల కోసమే కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని పం చాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు  అన్నారు. ఆదివారం ధర్మారం, గొల్లపల్లి నుంచి పులిగిల్ల వరకు రూ.4.97కోట్లతో నిర్మించే రోడ్డు పను లకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేసిన అభివృద్ధి చెప్పకుండా చేయని పను లను పట్టుకుని బ్లాక్‌మెయిల్‌ చేసే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. కరో నా కాలంలో కేంద్రం వడ్లు కొనవద్దని చట్టం తీసుకువస్తే.. దేశంలో ఎక్కడా వడ్లు కొంటలేరన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.30వేల కోట్లతో రైతులను  ధాన్యం కొనుగోళ్లు చేశారన్నారు. సాగు, తాగు నీటి ప్రాజెక్ట్‌లతో రాష్ట్రంలో రైతు లను ఆదుకుంటున్నట్లు తెలిపారు.  

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ మండలంలో పోలీస్‌స్టేషన్‌, వివిధ కార్యాలయాలుఏర్పాటుకు కృషి చేయాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్సీ  పోచం పల్లి  శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సొంత మండలం నడికూడను ఆదర్శ మం డలంగా చేసేందుకు మంత్రి నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్సీ నిధు ల నుంచి జీపీ భవనానికి రూ.25లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రజలు సహకరించాల ని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుమలత, ఎంపీపీ మచ్చ అనసూర్య, సర్పంచ్‌ ఊర రవీందర్‌రావు, ఎంపీటీసీ అప్పం చేరాలు,  వైస్‌ ఎంపీపీ చందా కుమారస్వామి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భీముడి నాగిరెడ్డి, ప్రధాన కార్య దర్శి దురిశెట్టి చందు, పీఏసీఎస్‌ మాదారం సొసైటీ చైర్మన్‌ లింగముర్తి నాయ కులు పాల్గొన్నారు. 

అన్ని ఒక్కసారి  ఇస్తే నువ్వు ఆగవ్‌..

అన్ని ఒక్కసారి ఇస్తే నువ్వు ఆగవ్‌ అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఉద్దేశించి మంత్రి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయి. నూతన మండలం నడికూడలో పోలీస్‌ స్టేషన్‌, ఎం పీడీవో కార్యాలయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే  మంత్రిని కోరగా  పోలీస్‌స్టేషన్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఏర్పాటు కు కృషి చేస్తానని, ఎంపీడీవో కార్యాలయం పరిశీలించిన తర్వాత చూస్తానని, అన్ని ఒక్కసారి చేస్తే నువ్వు ఆగవ్‌ అని మంత్రి వ్యాఖ్యానించారు. దీనికి బదు లుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయం స్కూల్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

పారిశుధ్య పనుల పరిశీలన..

దామెర: దామెరలో జీపీ సిబ్బంది పారిశుధ్య పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. ఆదివారం నడికూడ మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించడం కోసం ఎమ్మెల్యే ధర్మారెడ్డితో వెళ్తూ, దామెరలో పారి శుధ్యం, శానిటైజేషన్‌ పనులను కాన్వాయ్‌లోంచి దిగి పరిశీలించారు. 


Updated Date - 2021-06-21T05:44:58+05:30 IST