నిత్యావసర సరుకులకు ఆటంకం లేకుండా చూడండి-పువ్వాడ

ABN , First Publish Date - 2020-03-26T20:02:53+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తెలంగాణ లాక్‌డౌన్‌ జరుగుతోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.

నిత్యావసర సరుకులకు ఆటంకం లేకుండా చూడండి-పువ్వాడ

ఖమ్మం: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తెలంగాణ లాక్‌డౌన్‌ జరుగుతోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. కాబట్టి రాబోయే 20 రోజులకు నిత్యావసరాలకు ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ఆయన వ్యాపారులకు విజ్ఞప్తిచేశారు. రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌, సూపర్‌మార్కెట్స్‌ అసోసియేషన్‌, ఐఎంఎ అసోసియేషన్స్‌, వెజిటేబుల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వల్ల ఇటలీ, అమెరికాలాంటి దేశాలు కూడా ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభుత్వం విధించిన ఆంక్షలను తప్పకుండా పాటించాలన్నారు. మన దేశం, తెలంగాణ రాష్ట్రం ముందుగానే మెల్కొన్నదని అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నదని చెప్పారు. బయటి దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా మాత్రమే మన దేశంలోని కరోనా వైరస్‌ ప్రబలిందన్నారు. 


జనతా కర్ఫ్యూను పెడితే ప్రజలు అద్భుతంగా సక్సెస్‌ చేశారని పల్లెలు, పట్టణాలు అన్నతేడా లేకుండా అందరూ సక్సెస్‌చేశారని అన్నారు. అదే స్పూర్తితో తెలంగాణ లాక్‌డౌన్‌ను సక్సెస్‌చేయాలన్నారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. నిత్యావసర సరుకులు కొనేప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు స్వీయ నిర్బంధాన్నిపాటిస్తున్నారని, ఇదేస్పూర్తిని ప్రజలంతా కరోనా ఖతమయ్యే వరకూ ప్రదర్శించాలన్నారు. తెలంగాణ ప్రజలు, దేశ , ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిల వాలన్నారు. వైరస్‌ను పారదోలేందుకు వైద్యులు, పోలీస్‌, విద్యుత్‌, ఫార్మా, మీడియా ఎంతో కృషి చేస్తోందన్నారు. ఇది పరీక్షా కాలం. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీఛైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, కలెక్టర్‌ ఆర్‌ వి కర్ణన్‌, కమిషనర్‌ ఆఫ్‌పోలీస్‌ తఫ్సిర్‌ఇక్బాల్‌, మున్సిపల్‌కమిషనర్‌ అనురాగ్‌ జయంతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-26T20:02:53+05:30 IST