ఆదివాసీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-08-09T00:34:22+05:30 IST

ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం సముచిత స్ధానం కల్పిస్తూ వారి అభివృద్ధికి ప్రత్యేకచర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

ఆదివాసీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్‌: ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం సముచిత స్ధానం కల్పిస్తూ వారి అభివృద్ధికి ప్రత్యేకచర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు మంత్రి  శుభాకాంక్షలు తెలిపారు. రాష్ర్టావతరణ అనంతరం , ఆడబిడ్డలు ఆత్మస్థయిర్యంతో బతికేలా, గిరిజన తె గలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేకించి ప్రతి తండానూ గ్రామ పంచాయితీగా గుర్తించి, మా తండాలో మా రాజ్యం అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందని వెల్లడించారు. అటవీ హక్కుల చట్టం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 


అటవీ ఉత్పత్తులపై ఆధారపడిన అడవి బిడ్డలకు స్వావలంబణ ప్రసాదించే దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. గిరిజన విద్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ఆదవాసీల ఆత్మగౌరవ ప్రతీకమైన కుమ్రం భీం వర్ధంతిని అధికారికంగా ఘనంగా జరపడంతో పాటు జోడేఘాట్‌ అభివృద్ధికి రూ. 25 కోట్లు, నాలుగులైన్లరోడ్ల నిర్మాణం కోసం 7 కోట్లు నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. 


Updated Date - 2020-08-09T00:34:22+05:30 IST