Abn logo
Aug 4 2021 @ 00:44AM

బైక్‌ యాత్రికులకు మంత్రి అల్లోల అభినందన

బైక్‌ యాత్రికులను అభినందిస్తున్న ఐకే రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 3 : నిర్మల్‌కు చెందిన గుండా సాయివినయ్‌ బృందం కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు బైక్‌యాత్ర పూర్తి చేసిన సంద ర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అభినందిస్తూ సన్మానించారు. వీరి బైక్‌యాత్ర యావత్‌కు స్ఫూర్తి దాయకమని అన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, రాంకిషన్‌రెడ్డి, దేవరకోట చైర్మన్‌ లక్ష్మి నారాయణ, గుండా గణేష్‌, వెంకటేష్‌, సురేష్‌, సుభాష్‌, మహదేవ్‌, మణికంఠ ఉన్నారు.