Abn logo
Sep 21 2021 @ 20:38PM

217 జీవో’పై ప్రతిపక్షాలది రాజకీయం: మంత్రి అవంతి

విశాఖ: ప్రభుత్వం జారీ చేసిన 217 ప్రభుత్వ జీవోపై కావాలనే రాజకీయం చేస్తున్నాయని ప్రతిపక్షాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖ కలెక్టరేట్లో మంత్రి అవంతి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. రైతు భరోసా కేంద్రాల సేవల పోస్టర్ను మంత్రి విడుదల చేసారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ  జీవోపై కావాలనే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. మత్స్యకార సొసైటీలను  ఎలాంటి ఇబ్బందులు పెట్టబోమని స్పష్టంగా చెబుతున్నామన్నారు. ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో మాంసం, చేపలు అమ్ముతారనే విమర్శలు చేస్తున్న వారు.. ఆ వ్యాపారాలు చేసుకునే ప్రతిపక్షాల నాయకులు డబ్బులు సంపాదించుకుంటున్నారన్నారు. ఆ వ్యాపారం తాము చేయాలనే ఆలోచన చేస్తే తప్పా అని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు. బీజేపీతో జనసేనకు  పొత్తు పార్టీ ఉందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యపై పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతుందో, జనసేనపై కూడా అంతే ఉందన్నారు. సమస్యను పరిష్కరిస్తే అందరూ సంతోషిస్తారన్నారు. 


రాష్ట్ర వ్యాప్తంగా 3.2 కోట్ల విలువ చేసే విత్తనాలను సరఫరా చేశామని ఆయన తెలిపారు. 627 రైతు భరోసా కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. వైఎస్ఆర్ ఉచిత బీమా పథకం ద్వారా పదహారు వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. విభజన చట్టాలు అమలు చెయ్యకపోగా,  పుండు మీద కారం చల్లినట్లు స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీరు  ఉందని మంత్రి అవంతి  ఆరోపించారు. 

ఇవి కూడా చదవండిImage Caption