కరోనా ప్రచార రథాలను ప్రారంభించిన మంత్రి అవంతి

ABN , First Publish Date - 2020-08-14T21:34:43+05:30 IST

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కరోనా ప్రచార రథాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం నాడు జిల్లాలో కరోనా ప్రచార

కరోనా ప్రచార రథాలను ప్రారంభించిన మంత్రి అవంతి

విశాఖపట్నం: కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కరోనా ప్రచార రథాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం నాడు జిల్లాలో కరోనా ప్రచార రథాలను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనాపై అవగాహన కోసం ప్రచార రథాలను ప్రారంభించడం సంతోషకరం అన్నారు. ఎంతో మంది కరోనా బారిన పడి ప్రాణాలను కూడా కోల్పోయారని, కరోనా నివారణపై అవగాహన కోసం ఈ రథాలు పనిచేయనున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే సైబర్ క్రైమ్, ట్రాఫిక్‌పై ఎప్పటికప్పుడు ఈ వాహనాల ద్వారా సమాచారం ఇస్తారని మంత్రి వివరించారు. పోలీసులు ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ప్రజలందరి రక్షణ కోసం రేయింబవళ్లు పని చేస్తున్నారని పోలీసులను మంత్రి అవంతి అభినందించారు. ప్రెండ్లీ పోలీసింగ్ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని అన్నారు. కరోనాను అవకాశంగా తీసుకుని కొందరు దోపిడీ చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారని, అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి అవంతి హెచ్చరించారు.

Updated Date - 2020-08-14T21:34:43+05:30 IST