రైతు సమస్యలు తెలుసుకున్న మంత్రి

ABN , First Publish Date - 2020-05-27T11:08:33+05:30 IST

దేవాదుల నీళ్లు వస్తున్నాయా.. చెరువులు నిండుకుంటున్నాయా..

రైతు సమస్యలు తెలుసుకున్న మంత్రి

ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలి సూచన


సంగెం, మే 26: దేవాదుల నీళ్లు వస్తున్నాయా.. చెరువులు నిండుకుంటున్నాయా.. పంట ఎంత పండింది.. పెట్టుబడి వచ్చిందా.. అంటూ  పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాపులకనపర్తి సొసైటీ అవరణలో కొనుగోలు కేంద్రం వద్ద మంగళవారం రైతులతో మాట్లాడారు. మంత్రి, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు మహబూబాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్లి వరంగల్‌కు వస్తూ మార్గ మధ్యలో కాపులకనపర్తి కొనుగోలు కేంద్రం వద్ద ఆగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల దేవాదుల నీటిని ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. నీటి విడుదల ద్వారా 50వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు.


కొనుగోలు కేంద్రంలో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యంను తరలించడంలో ఏర్పడుతున్న ఇబ్బందుల నుంచి గట్టేక్కించాలని కలెక్టర్‌ హరితకు సూచించారు. ఆలాగే మిల్లర్లు ధాన్యాంను దిగుమతి చేసుకోవడంలో ఎలాంటి  ఇబ్బందులు పెట్టొదన్నారు. కాగా, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చెప్పిన పంటలనే వేయాలని, వరి పంటలు వేస్తే సన్నరకాలు వేస్తే లాభాలు పొందవచ్చని సూచించారు. కాగా, కొనుగోలు కేంద్రంలో మాస్క్‌లు లేనివారికి మాస్క్‌లను పంపిణీ చేశారు. మాస్క్‌లు లేనివారికి వేయ్యి వరకు జరిమానా వేసే చట్టంను ప్రభుత్వం తీసుకవచ్చిందని ఇందుకు మాస్క్‌, చేతి రుమాలు, టవల్‌ను మూతికి అడ్డుగా కట్టుకోవాలని చెప్పారు.

Updated Date - 2020-05-27T11:08:33+05:30 IST