Abn logo
Oct 24 2020 @ 06:08AM

రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం

Kaakateeya

మంత్రి బాలినేని 


ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 23 : రైతుల కోసం వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శు క్రవారం ఒంగోలులోని స్పందనభవన్‌లో ఉచిత వ్య వసాయవిద్యుత్‌ పథకంపై జిల్లాస్థాయి విద్యుత్‌ క మిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిఽథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లా డుతూ వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ పథకా న్ని దేశంలోనే తొలిసారిగా దివంగత సీఎం వైఎస్‌. రాజశేఖరరెడ్డి అమలు చేశారని తెలిపారు. ఆయన తనయుడు, ముఖ్యమత్రి జగన్మోహన్‌ రెడ్డి మరో అ డుగు ముందుకు వేసి ఉచిత విద్యుత్‌తో పాటు మీట రును ఉచితంగా పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఈ పథకాన్ని నిరాటకంగా కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గృహ వినియోగానికి ఎ లాంటి అంతరాయం లేకుండా ప్రజలకు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.


గత పాలన లోపాల వల్ల రాష్ట్ర విద్యుత్‌శాఖకు రూ.75వేల కోట్లు అప్పులు ఉన్నాయని, అందులో రైతులు కట్టా ల్సిన రూ.8వేల కోట్లు ఉన్నాయన్నారు. రైతుల బకా యిలను ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ ఉచిత విద్యుత్‌ అమలులో భాగంగా రానున్న ఏప్రిల్‌ 1నుంచి విద్యుత్‌ నగదు బదిలీ ప థకాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమం లో కలెక్టర్‌ పోలా భాస్కర్‌, విద్యుత్‌శాఖ సీఎండీ పద్మనాభం జనార్దన్‌రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కలెక్టర్‌ పోలా భాస్కర్‌, జేసీ బాపిరెడ్డి, స బ్‌ కలెక్టర్‌ భార్గవ్‌తేజ్‌ తదితరులు పాల్గొన్నారు.    

Advertisement
Advertisement