చేతులెత్తి వేడుకుంటున్నా.. వారి సమాచారం ఇవ్వండి: మంత్రి బాలినేని

ABN , First Publish Date - 2020-04-02T20:26:36+05:30 IST

ప్రకాశం: ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయంలో మునిసిపల్ అధికారులతో నగరంలోని పారిశుధ్యంపై విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

చేతులెత్తి వేడుకుంటున్నా.. వారి సమాచారం ఇవ్వండి: మంత్రి బాలినేని

ప్రకాశం: ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయంలో మునిసిపల్ అధికారులతో నగరంలోని పారిశుధ్యంపై విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న 15 పాజిటివ్‌ కేసులకు తోడు మరో 2 పాజిటివ్‌ కేసులు నమోదు కావటం పట్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కరోనా పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని బాలినేని ప్రజలను కోరారు.


కొందరు వ్యాపారులు నిత్యావసరాలు అధిక ధరలకు అమ్ముతున్నారని సమాచారం అందిందని తెలిపారు. అటువంటి వారి షాపులు మూసి వేయించటంతో పాటు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాలినేని హెచ్చరించారు. ప్రజలకు నిత్యావసర సరుకుల రేట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఇతర దేశాలు, డిల్లీ వెళ్లి వచ్చిన వారు మానవతాదృక్పదంతో ఆలోచించాలని.. అధికారులకు సమాచారం ఇవ్వాలని చేతులెత్తి వేడుకుంటున్నానన్నారు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి బాలినేని సూచించారు.


Updated Date - 2020-04-02T20:26:36+05:30 IST