Advertisement
Advertisement
Abn logo
Advertisement

మావోయిస్ట్ పార్టీకి టీడీపీకి తేడా లేదు: Botsa

విజయనగరం: తెలుగు దేశం పార్టీపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీపైన,  దాడులను ఖండించిన ప్రతిపక్షాలపైన మంత్రి విరుచుకుపడ్డారు. టీడీపీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతామన్నారు. మావోయిస్ట్ పార్టీకి టీడీపీకి తేడాలేదని వ్యాఖ్యానించారు. ‘‘మీ పార్టీ ప్రతినిధి మాట్లాడే వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతావు చంద్రబాబు. నోటికి అన్నం తింటున్నావా, అసుద్ధం తింటున్నావా?’’ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. బీజేపీతో ఉన్నానంటూ చంద్రబాబు పార్టనర్ పవన్ కళ్యాణ్ సమర్ధన సిగ్గుచేటన్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చంద్రబాబుకు వత్తాసు పలకటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బంద్‌లో ప్రజలెవరూ పాల్గొనకపోవటం చంద్రబాబుకి సిగ్గుచేటన్నారు. కాగా టీడీపీపై దాడుల అంశంపై సమాధానం చెప్పకుండా బొత్స దాటవేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement