Abn logo
Apr 13 2021 @ 19:22PM

బీజేపీ సున్నా అని తెలిసే పవన్ క్వారంటైన్‌కు వెళ్లారు: బొత్స

విశాఖ: బీజేపీతో ఉంటే తన పరిస్థితి సున్నా అని తెలిసే జనసేన అధినేత పవన్ కల్యాన్ క్వారంటైన్‌కు వెళ్లారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నారని బొత్స పేర్కొన్నారు. రాళ్ళ దాడి చేశారని చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని బొత్స విమర్శించారు. టీడీపీకి డిపాజిట్ కూడా దక్కదని చంద్రబాబు ముందుగానే ఊహించారని బొత్స ఎద్దేవా చేశారు. లోకేష్ గురించి అచ్చెన్నాయుడు నిజమే మాట్లాడారని బొత్స పేర్కొన్నారు. తాము మీడియా ముందు మాట్లాడే విషయాన్ని నాలుగు గోడల మధ్య  అచ్చెన్న చెప్పారని బొత్స అన్నారు.