Advertisement
Advertisement
Abn logo
Advertisement

మమ్ములను చంద్రబాబు ఎన్నోసార్లు కించపరిచారు: బొత్స

అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు తమను ఎన్నోసార్లు కించపరిచారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని కలెక్టరేట్‌‌లో జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి బొత్స హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ నిర్వహించే గౌరవ సభలపై విమర్శలు చేశారు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందంటారు కానీ ఈ రకమైన ఉద్యమాలు చూడలేదన్నారు. ఉద్యమాలు చేయమనండని బొత్స వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతిచ్చిందో ప్రజలే తేల్చుతారని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఘటనను తాను సమర్థించడం లేదన్నారు. మమ్మల్ని ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు కించపరిచారని, అయినా వారిని మేం కించపరిచామా అని ఎదురు ప్రశ్న వేశారు. అది తమ అభిమతం కాదన్నారు.


ఇంతవరకు గట్టిగా మాట్లాడలేదన్నారు. అందరినీ ఒకే గాటిన కడితే ఎలా అని ప్రశ్నించారు. శాసనసభలో మాట్లాడితే ప్రతిదీ రికార్డు అవుతుందని ఆయన పేర్కొన్నారు. పక్కనుంచి ఎవరో వచ్చి కామెంట్ చేస్తే అది కౌంట్ అవుతుందా అని ఆయన నిలదీశారు. పక్కన ఉన్నవాళ్లు కామెంట్ చేస్తే స్పీకర్, నేను బాధ్యులా అని బొత్స ప్రశ్నించారు. ఇది ప్రాధాన్యత అంశం కానే కాదన్నారు. 


Advertisement
Advertisement