Vishaka ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

ABN , First Publish Date - 2021-08-28T23:16:34+05:30 IST

రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండపడ్డారు. రాజధానిగా

Vishaka ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

విజయనగరం: రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధానిగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో నాయకులు కార్యక్రమాలు చేపడితే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను వైసీపీ ప్రకటిస్తే ప్రతిపక్ష పార్టీలు కోర్టులు కెళ్ళి స్టేలు తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు. ఏ మొహం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో చర్చావేదిక అంటున్నారని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ని వ్యతిరేకించిన మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడే హక్కు లేదని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. 


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను ముఖ్యమంత్రి జగన్ నేరుగా వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో కూడా తీర్మానం చేశామని ఆయన గుర్తు చేశారు. నరేంద్రమోదీ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న అశోక్ గజపతికి స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ అంశం తెలియదా అని మంత్రి ప్రశ్నించారు. అశోక్ గజపతి స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను నాడు ఎందుకు వ్యతిరేకించలేదన్నారు. విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర హక్కు కాదు, అది ఆంధ్రుల హక్కు అని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందన్నారు. 


ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని ఆయన పేర్కొన్నారు. సుజల స్రవంతి కోసం టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో 400 కోట్లు మాత్రమే కేటాయించటానికి అచ్చెన్నాయుడుకు సిగ్గులేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన మీరు మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఏ అభివృద్ధి చేశారని పరోక్షంగా అచ్చెన్నాయుడుపై మంత్రి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


 గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా కేవలం పదిశాతం మాత్రమే ఉందన్నారు. గంగవరం పోర్టు అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వానికి కొత్తగా అవకాశం లేదన్నారు. గంగవరం పోర్టు కోసం ప్రభుత్వం కూడా కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉందన్నారు.  ఆ అవకాశం లేకే పోర్ట్ అమ్మకానికి సిద్ధపడిందన్నారు. 


పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగదలకు వైసీపీ కూడా నిరసన వ్యక్తం చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మంత్రి బొత్స ఆరోపించారు. గత రెండేళ్లలో వైసీపీ అప్పులు చేసి నేరుగా ప్రజల ఖాతాలకే వాటిని బదిలీ చేశామన్నారు.


Updated Date - 2021-08-28T23:16:34+05:30 IST