భూముల మార్కెట్ విలువ పెంపు: మంత్రి ధర్మాన

ABN , First Publish Date - 2020-08-08T01:40:03+05:30 IST

రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలో భూముల విలువ త్వరలోనే పెంచడానికి శాస్త్రీయ బద్ధంగా కసరత్తు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ధర్మాసన

భూముల మార్కెట్ విలువ పెంపు: మంత్రి ధర్మాన

అమరావతి: రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలో భూముల విలువ త్వరలోనే పెంచడానికి శాస్త్రీయ బద్ధంగా కసరత్తు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ధర్మాసన కృష్ణదాస్ చెప్పారు. దీనికి సంబంధించిన తుది నివేదికను రూపొందించి ముఖ్యమంత్రి జగన్‌కు అందజేస్తామని తెలిపారు. భూముల మార్కెట్ విలువ పెంపు అంశంపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ నెల 1వ తేదీ నుంచి కొత్త విలువలు అమలవుతాయని భావించినప్పటికీ ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం కోసం కాస్త ఆలస్యమైందని ధర్మాన తెలిపారు. భూముల విలువల పెంపునకు సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ తన వెబ్ సైట్‌లో గత కొద్ది రోజులుగా వినతులు స్వీకరించిందన్నారు. దీంతో కొన్ని పట్టణాల్లో విలువలను సవరించడంలో ఆలస్యమైందని మంత్రి తెలిపారు. మూడు దశలలో పక్కాగా సమాచారం క్రోడీకరించి దాని ప్రకారంగా భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు కసరత్తు చేశామని చెప్పారు. ధరలను ఎంత వరకు పెంచాలన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చామని, వాటి పెంపు కనిష్టంగా పది శాతం ఉంటుందని మంత్రి వెల్లడించారు. అయితే భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ఇప్పటి వరకు వచ్చిన రెవెన్యూ, డాక్యూమెంట్ల రిజిస్ట్రేషన్, ఆయా ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-08-08T01:40:03+05:30 IST