కరోనా కట్టడికి కార్యోన్ముఖులు కావాలి: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-04-20T00:22:13+05:30 IST

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ రూరల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి

కరోనా కట్టడికి కార్యోన్ముఖులు కావాలి: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ రూరల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల స్థానిక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ రూరల్ కలెక్టరేట్ నుంచి మాట్లాడగా, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు లు హైదరాబాద్ నుంచి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, అడిషనల్ కలెక్టర్లు, జెడ్పి ల  సీఈఓ లు, డీఆర్ డిఓ లు, డీపీఓ లు, డీఎల్పీ లు, ఎంపిడివో లు, ఎంపిఓ లు, ఏపీఓ లు,  కార్యదర్శులు తదితర అధికారులు ఆయా మండల కేంద్రాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయా గ్రామాలలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వేసవిలో గ్రామ పంచాయతీలలో చేపట్టవలసిన కార్యక్రమాలపై కరోనా నియంత్రణ పై, వారికి దిశా నిర్దేశం చేశారు. కరోనా వ్యాపించకుండా అన్ని గ్రామాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించేలా చూడాలి. మాస్క్ లు ధరించని వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు వెయ్యి రూపాయల జరిమానా విధించాలని మంత్రి ఆదేశించారు. వ్యాక్సిన్ వేసుకోని వారంతా తప్పని సరిగా వేయించుకోవాలన్నారు. ప్రజలు భౌతికదూరం పాటించాలన్నారు. గత సంవత్సరం లాగే ఈ సారి కూడా డ్వాక్రా సంఘాలు మాస్క్ లు తయారు చేసేలా ప్రోత్సహించాలని అన్నారు. 45ఏళ్లు దాటిన వారంతా వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని అన్నారు. 

Updated Date - 2021-04-20T00:22:13+05:30 IST