Abn logo
Jun 14 2021 @ 14:40PM

నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

జనగామ: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని హంగులతో ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట ఉండేందుకు సమీకృత కార్యాలయాల సముదాయాలను నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. సమైఖ్య రాష్ట్రంలో ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక సమస్యల పరిష్కారానికి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారని అన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే చిన్న జిల్లాల ఏర్పాటు, ఒకే దగ్గర అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.