తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలి: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-07-10T19:56:26+05:30 IST

తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ ధ్యేయంగా నిరంతరం అంకిత భావంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందరం అండగా ఉండాలన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించి రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లతో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. 


 గుండాల మండలంలో రూ. 4.21 కోట్లతో నిర్మించిన గుండాల నుండి పస్రా వెళ్లే రహదారిపై గల మల్లన్న వాగు పై హై-లెవెల్ బ్రిడ్జి ను ప్రారంభించారు. అలాగే గుండాల మండలం నర్సాపురం గ్రామంలో రూ.2.17 కోట్లతో మల్లన్న వాగు మీద నిర్మించిన చెక్ డ్యాం ను కూడా మంత్రి ప్రారంభించారు.కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ మలోత్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-10T19:56:26+05:30 IST