మంత్రి ఎర్రబెల్లిని కలిసిన పంచాయితీరాజ్ శాఖ కమిషనర్

ABN , First Publish Date - 2021-09-05T20:43:56+05:30 IST

రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎ శరత్ ఆదివారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన పంచాయితీరాజ్ శాఖ కమిషనర్

హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎ శరత్  ఆదివారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో నూటికి 60 శాతం పైన  ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధియే రాష్ట్ర అభివృద్ధియని విశ్వసించే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, వివిధ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న  వివిధ గ్రామీణ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు  కావటానికి అహర్నిశలు కృషి చేయాలని మంత్రి కోరారు.

Updated Date - 2021-09-05T20:43:56+05:30 IST