కాళోజీకి నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-09-09T20:16:41+05:30 IST

నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలం ఎత్తిన ఉద్యమ కారుడు, స్వాతంత్ర్య సమర యోధుడు కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా హన్మకొండలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా నివాళులర్పించారు.

కాళోజీకి నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలం ఎత్తిన ఉద్యమ కారుడు, స్వాతంత్ర్య సమర యోధుడు కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా హన్మకొండలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు, కాళోజీ గా, కాళన్న"గా సుపరిచితులని అన్నారు.కాళోజీ తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమ ప్రతిధ్వని.పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ వైతాళికుడని, .అనాడు నిజాం నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా కలం ఎత్తిన యోధుడని పేర్కొన్నారు.


తెలంగాణా ఉద్యమకారుడిగా కాళోజీ సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి,  జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడని గుర్తు చేశారు.విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు.తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు.రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను అతని అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలోరాజ్య‌స‌భ స‌భ్యులు బండా ప్ర‌కాష్‌, మేయ‌ర్ గుండు సుధారాణి, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌ జిల్లాల క‌లెక్ట‌ర్లు బి.గోపి, రాజీవ్‌గాంధీ హ‌న్మంతు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ప్రావీణ్య‌, ఉద్యోగ సంఘాల నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-09T20:16:41+05:30 IST