ప్రజల్లో కరోనా పై విస్తృతంగా అవగాహన కల్పించాలి- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-08-10T00:29:19+05:30 IST

మరికొద్ది రోజుల పాటు ప్రజా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకోవాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.

ప్రజల్లో కరోనా పై విస్తృతంగా అవగాహన కల్పించాలి- ఎర్రబెల్లి

హైదరాబాద్‌: మరికొద్ది రోజుల పాటు ప్రజా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకోవాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. కరోనా పట్ల ప్రజలకు  విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటించడం, స్వీయం నియంత్రణతో పాటు,సమన్వయంతో వ్యవహరించాలని చెప్పారు. మంత్రుల నివాసంని తన ఇంటి నుంచి పాలకుర్తి, నియోజక వర్గంని తొర్రూరు, రాయపర్తి మండలాలు, తొర్రూరు పట్టణం నుంచి ఒక్కోమండలం నుంచి 130కి పైగా ప్రజా ప్రతినిధులు , ఆర్డీవో , సహా అన్నిశాఖల అధికారులు, పోలీసులు, పలువురు ప్రముఖులతో మంత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి త్వరలోనే నియోజక వర్గానికి రెండు అంబులెన్స్‌ వాహనాలు, 4లక్షల మాస్కులను ఎర్రబెల్లి ట్రస్ట్‌ద్వారా అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు తెలిపారు.


ఒక వాహనం తొర్రూరు కేంద్రంగా, మరో వాహనం పాతకుర్తి కేంద్రంగా పనిచేస్తాయన్నారు. మాస్కులు లేకుండా ఎవరైనా బయట తిరిగితే వారికి జరిమానాలు విధించాలని మంత్రి ఆదేశించారు. ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. అంతా మాస్కుల సంస్కృతిని పాటించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశంతో రాష్ట్రంతో పాటు పాలకుర్తి నియోజక వర్గంలోని వివిధ హాస్పిటల్స్‌కి సరిపడా పీపీఈ కిట్లు, మందులు, మాస్కులు, ఆక్సీజన్‌ వంటి అన్నిరకాల సదుపాయాలు అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సరైన రీతిలో పనిచేయాలని ఆదేశించారు. ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్టు తేలితే అలాంటి అధికారులపై వేటు తప్పదని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. 

Updated Date - 2020-08-10T00:29:19+05:30 IST