Abn logo
Oct 30 2020 @ 15:25PM

ఆఖరుపత్తివరకూ రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలుచేస్తుంది- ఎర్రబెల్లి

వరంగల్‌: ఆఖరు పత్తివరకూ రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలుచేస్తుందని పంచాయితీరాజ్‌శాఖ, గ్రామీణాభివృది శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. ఈసారి వరంగల్‌ఉమ్మడి జిల్లాలో 7లక్షల 58వేల 560ఎకరాల విస్తీర్ణంలో పత్తిపండిందన్నారు. పత్తిరైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో పత్తికొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడతూ పత్తి దిగుబడి అంచనా 6లక్షల 25వేల మెట్రిక్‌టన్నులని చెప్పారు. ఎనుమాముల మార్కెట్‌లోకి ఎక్కువగా వరంగల్‌ అర్బన్‌జిల్లా నుంచే ఎక్కువగా పత్తి వస్తుందన్నారు. 


వరంగల్‌అర్బన్‌ జిల్లాలో 842 ఎకరాల విస్తీర్ణంలో పత్తి పండిందన్నారు.  గత ఏఆది సీసీఐ కేంద్రాలు 18కాగా ఈసారి 28 కేంద్రాల ద్వారా పత్తికొనుగోలుచేస్తున్నామని చెప్పారు. అందులో 30జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయని తెలిపారు. ఇవే కాకుండా ధాన్యం, పసుపు, మిర్చి ,కంది వంటి పంటలను కూఆ కొనుగోలుచేస్తారని తెలిపారు. ఎనుమాములలో 19 లక్షల మెట్రిక్‌టన్ను లబస్తాలను నిల్వ చేసే వీలుందన్నారు.అలాగే వరంగల్‌ మార్కెట్‌యార్డులో 24 కోల్డ్‌స్టోరేజీలు ఉన్నాయని మంత్ర ఎర్రబెల్లి తెలిపారు.


రైతులు కూడా సీసీఐ నాణ్యతా ప్రమాణాలతో కూడిన పత్తినే మార్కెట్‌యార్డుకు తీసుకు రావాలని సూచించారు. రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదూరి రమేష్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, మార్కెట్‌కమిటీ ఛైర్మన్‌ సదానందం తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement