మన రాష్ట్రంలో లాంటి పథకాలు మరే రాష్ట్రంలో లేవు:Errabelli

ABN , First Publish Date - 2022-06-13T20:19:17+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao)అన్నారు.

మన రాష్ట్రంలో లాంటి పథకాలు మరే రాష్ట్రంలో లేవు:Errabelli

మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao)అన్నారు.దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని,దేశానికి కేసిఆర్(kcr) దిశా నిర్దేశం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.కేసిఆర్ నాయకత్వం వహిస్తే, తెలంగాణ లాగా దేశం కూడా మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతి(pattana pragati) కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తొర్రూరు పట్టణ ప్రగతిలోమంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతి కింద 4 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. 


6,110 నల్లా కనెక్షన్ల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతున్నదన్నారు. 445 మందికి కేసిఆర్ కిట్లు అందాయన్నారు.తొర్రూరు సమగ్ర అభివృద్ధికి హైదరాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ద్వారా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.రూ.100 కోట్లతో తొర్రూరు పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు.తొర్రూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి  ప్రణాళిక ఇప్పటికే రూ.50 కోట్లతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు.


రూ.25 కోట్లతో త్వరలో మిషన్ భగీరథ ద్వారా తొర్రూరు పట్టణానికి 24 గంటలపాటు మంచినీరు సరఫరా అవుతుందని తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మహిళా సంఘాలకు కోటి 25 లక్షల బ్యాంకు లింకేజ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి పట్టణ వీథి లలో పర్యటించారు. పారిశుద్ధ్యం, మురుగు నీటి కాలువలు, మంచినీటి సరఫరా వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం జరిగిన పట్టణ ప్రగతి సభలో మంత్రి సమీక్షించారు. 

Updated Date - 2022-06-13T20:19:17+05:30 IST