Abn logo
Sep 19 2021 @ 14:49PM

అభివృద్ధి, సంక్షేమానికి కేసిఆర్ పెద్ద పీట వేస్తున్నారు: ఎర్రబెల్లి

వరంగల్: కేంద్ర సహకారం లేకున్నా సాగునీరు, 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, రుణాల మాఫీ సహా పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజల కోసం ఇంతగా చేస్తున్న ప్రభుత్వం దేశంలోనే లేదన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ, ప్రజలు సహకరించాలని, అన్ని గ్రామాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ, సుడిగాలి పర్యటన చేశారు. పాలకుర్తి మండలంలోని శాతాపురంలో పలు సిసి రోడ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన, చెన్నూరులో గ్రామపంచాయితీ భవనం, రైతువేదిక ల ప్రారంభోత్సవం, పెద్ద తండా(బి) లో గ్రామ పంచాయితీ లను మంత్రి ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అన్ని కులాలు, వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. నిరుపేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా సీఎం కేసిఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నారని చెప్పారు.  డబుల్ బెడ్ రూం ఇండ్లు రానివాళ్లు బాధపడొద్దు. త్వరలో భూమి వున్న వాళ్లకు డబ్బులు ఇచ్చి మరీ ఇల్లు కట్టిస్తామని అన్నారు.కొన్ని పార్టీల నాయకులు రాజకీయం చేస్తూ...కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.వాళ్లకు అన్ని తెలుసు. రైతు వేదికలు రైతులను సంఘటిత పరుస్తోందని మంత్రి తెలిపారు. 


సీఎం కేసిఆర్ స్వయంగా రైతు కాబట్టే రైతుల మేలు కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. రైతు బంధు, రైతు భీమా, రుణమాఫీ లాంటి పథకాలు ప్రవేశపెట్టి రైతును రాజు ను చేశారు. ఎవరూ ఊహించని దళిత బంధు పథకం ప్రవేశపెట్టి దళితులకు ఆరాధ్య దైవం గా కేసిఆర్ మారారని అన్నారు. ఊరిలో నిజమైన పేదోల్లు దళితులు అందుకే వాళ్లకు 10 లక్షలు ఇస్తున్నాం. ముందుగా దళితులు, తరువాత ఎస్ టీ లు, బీసీ లకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption