Abn logo
Sep 19 2021 @ 16:30PM

అర్హలైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు: మంత్రి ఎర్రబెల్లి

మహాబుబాబాద్ జిల్లా: అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.ఆదివారం నాడు మహాబుబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని చీకటాయపాలెంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.చీకటాయపాలెం గ్రామంలో 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో రెండు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన యాభై రెండు పడక గదుల ఇండ్లకు మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  కరోనా కష్ట కాలంలో కల్యాణలక్ష్మి ఆసరా పింఛన్లు రైతుబంధు వంటి పథకాలను నిరంతరంగా అమలుచేసి నిరుపేద ప్రజలకు అండగా నిలిచారని అన్నారు.


తన వంతుగా తమ ట్రస్టు తో నిత్యవసర వస్తువులు అందించానని ఆనందయ్య మందులు కూడా అందించడం జరిగిందన్నారు. తొర్రూరు కు అంబులెన్స్ స్వయంగా తన సొంత ఖర్చుతో అందజేశానని, అదేవిధంగా  ప్రభుత్వ హాస్పటల్ లో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయించానన్నారు.దళిత బంధు పథకంతో నిరుపేద దళిత జీవితాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం నీరుతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిందని ఆయన తెలిపారు. 


మిషన్ భాగీరథ కార్యక్రమం క్రింద రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందజేస్తున్నమని ఆయన తెలిపారు. కరోనా నిర్మూలనకు ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోని కరోనా నుండి కాపాడుకోవాలని మంత్రి అన్నారు.గ్రామస్తుల కోరికమేరకు పాలేరు వాగుపై చెక్ డ్యామ్, హరిపిరాల రోడ్డు, రైతుల విజ్ఞప్తి మేరకు ఒకటిన్నర కిలోమీటర్ల సూర్యాపేట రోడ్డు కనెక్టివిటీ త్వరలో చేపడతామన్నారు.అనంతరం చేర్లపాలెం గ్రామంలో వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మహాబుబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption