Abn logo
Sep 25 2021 @ 17:56PM

సివిల్స్ ర్యాంకర్స్ డాక్టర్ శ్రీజ, వర్షిత లను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్: యుపిఎస్సి-2020 ఫలితాల్లోమొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో 20వ ర్యాంక్ సాధించిన డాక్టర్ పి.శ్రీజను, 413వ ర్యాంకు సాధించిన వర్షిత లను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం వారికి ఫోన్ చేసి అభినందించారు. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీజ తల్లిదండ్రులు శ్రీనివాస్, కీర్తిలత హైదరాబాద్, ఉప్పల్ లోని చిలుకా నగర్ లో స్థిరపడ్డారు. 


కాగా వర్షిత కుటుంబం హన్మకొండ బస్ స్టాండ్ సమీపంలో ఉంటున్నారు. ఈ ఇద్దరు మహిళలు వరంగల్ కీర్తి పతాక ను దేశవ్యాప్తంగా చేశారన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. వారికి తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం, తోడ్పాటును అభినందించారు. అలాగే భావి తరాలకు ఆదర్శంగా నిలిచారని, భవిష్యత్తులో కేంద్ర క్యాడర్ అధికారులుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు.