కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-09-29T21:34:30+05:30 IST

ఇంద్రకీలాద్రి నెలకొన్న కనకదుర్గమ్మను రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుదర్శించుకున్నారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

విజయవాడ: ఇంద్రకీలాద్రి నెలకొన్న కనకదుర్గమ్మను రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుదర్శించుకున్నారు. బుధవారం ఆయన అమ్మవారి దర్శనం కోసం విక్కడికి వచ్చారు.ఈ సందర్భంగా ఆలయ పూజారులు,ధర్మకర్తలు పూర్ణకుంభ స్వాగతం పలికి అమ్మ వారి దర్శనం చేయించి వేదపండితులు అమ్మ వారి వస్త్రాలతో సన్మానించి ఆశీర్వచనం అందచేశారు.


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అమ్మ వారిని రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు. అమ్మ వారి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.రెండు రాష్ట్రాలు ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నాను అన్నారు. విజయవాడకి ఎప్పుడు వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటాను అని ఆయన చెప్పారు.తదనంతరం తన మిత్రుడైన బొంతు శ్రీనివాస్ రెడ్డి తండ్రి బాపి రెడ్డి మరణించగా వారి స్వగ్రామమైన గుంటూరు జిల్లాలో గల కొల్లిఫర్ మండలం మున్నంగి గ్రామంలో వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Updated Date - 2021-09-29T21:34:30+05:30 IST