Abn logo
Oct 9 2021 @ 15:15PM

మంత్రి ఎర్రబెల్లికి దసరా ఉత్సవ ఆల్బమ్ అందజేసిన కమిటీ

హైదరాబాద్: వ‌రంగ‌ల్ - క‌రీమాబాద్ - ఉర్సు గుట్ట రంగ‌లీలా మైదానంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే విజ‌య‌ద‌శ‌మి ద‌స‌రా ఉత్స‌వాల‌కు హాజరు కావాల్సిందిగా ఉత్స‌వ క‌మిటీ రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని ఆహ్వానించింది. శనివారం హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో మంత్రిని క‌లిసిన ఆ కమిటీ ఉత్స‌వాల ప్ర‌త్యేక ఆల్బం ని మంత్రికి స‌మ‌ర్పించింది. బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా ఉత్స‌వాల‌కు పెట్టింది పేరైన వ‌రంగ‌ల్ జిల్లాలో రంగ‌లీలా మైదానంలో ద‌స‌రా ఉత్స‌వాలు అత్యంత వైభ‌వంగా జ‌రుతాయి.