గ్రామాల్లో వైద్య శిబిరాలు అభినందనీయం: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-10-13T20:34:48+05:30 IST

తెలంగాణ ఆవిర్భావం తర్వాత వైద్య రంగంలో గుణాత్మక అభివృద్ధి జరిగిందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

గ్రామాల్లో వైద్య శిబిరాలు అభినందనీయం: మంత్రి ఎర్రబెల్లి

జనగాం జిల్లా: తెలంగాణ ఆవిర్భావం తర్వాత వైద్య రంగంలో గుణాత్మక అభివృద్ధి జరిగిందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అమెరికా స్థాయిలో ప్రజల హెల్త్ ప్రొఫైల్,కరోనా అదుపులో మనమే నెంబర్ వన్ గా ఉన్నామని చెప్పారు.దేవరుప్పులలో అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి, ఉన్నత అవకాశాల కోసం ఉన్న ఊరు నీ, కన్న తల్లి నీ వదలి వెళ్లిన డాక్టర్లు తమ కన్నతల్లి రుణం తీర్చుకోవడానికి అమెరికాలో భారతీయ మూలాలు ఉన్న డాక్టర్లు కలిసి అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ అరిజిన్ గా ఏర్పడ్డారు.


మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అయిన సందర్భంగా, మన దేశంలోని 75 గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు.ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. అందులోభాగంగానే జనగామ జిల్లాలోని దేవరుప్పుల, చిల్పూర్ మండలంలోని రాజవరం గ్రామాలను ఎంపిక చేయడం మన అదృష్టమని అన్నారు. దేవరుప్పులలోని స్కూల్ లో చదివిన నాగేంద్ర ప్రసాద్ శాన్ ఫ్రాన్సిస్కో లో కాన్సూల్ జెనరల్ గా పని చేస్తున్నారు.ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు జరిపి, అమెరికా వైద్యులతో సంప్రదింపులు చేసి, రోగాలకు అవసరమైన మందుల సిఫారసు చేస్తారు.నేరుగా రోగుల ఫోన్ల కే వాట్సాప్ ద్వారా మొత్తం సమాచారం అందిస్తారని తెలిపారు. 

Updated Date - 2021-10-13T20:34:48+05:30 IST