Abn logo
Oct 21 2021 @ 14:06PM

పోలీసు అమర వీరులకు మంత్రి ఎర్రబెల్లి నివాళి

హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన నివాళులు అర్పించారు.అమరుల త్యాగాలు నిత్యం స్మరనీయం అన్నారు. అక్టోబర్ 21, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా అమరుల సేవలను మంత్రి స్మరించుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డిన పోలీస్ అమరుల సేవలను ప్రజలు ఎన్నటికీ మరువరని అన్నారు.అమరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి సీఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి గుర్తు చేశారు.

క్రైమ్ మరిన్ని...