Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 30 2021 @ 15:12PM

ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కి చేయుతనివ్వాలి: పెసాప్రతినిధులు

హైదరాబాద్: పంచాయత్ ఎక్స్ టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్(పీఈఎస్ఏ) కోఆర్డినేటర్స్, మోబిలైజర్స్ కు గౌరవ వేతనాలను ఇప్పించాలని, ఏజెన్సీ గూడాలు, తండాలలో సీసీ రోడ్స్, డ్రైనేజీ లు, చెక్ డ్యామ్ లు నిర్మించి ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కి చేయుతనివ్వాలని సంబంధిత సంఘాల ప్రతినిధులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని శనివారం కలిసి విజ్ఞప్తి చేశారు.గత రెండు సంవత్సరాలుగా పెసా కోఆర్డినేటర్స్, మోబిలైజర్స్ కి రావలసిన గౌరవ వేతనం రావడం లేదని మంత్రి గారికి విన్నవించుకున్నారు. 


అంతే కాకుండా మోబిలైజర్స్ రూ. 2,500 చాలీచాలని వేతనం తో కుటుంబ పరంగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకు గ్రామ పంచాయతీ వర్కర్లకు ఇచ్చినట్లుగా రూ. 8,500 ఇవ్వాలని, జిల్లా కోఆర్డినేటర్ లకు 30శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని మంత్రికి విన్నవించు కున్నారు. మంత్రిని కలిచిన వారిలో ఐటీడీఏ పెసా జిల్లా  సమన్వయ కర్త  కొమురం ప్రభాకర్, వాజేడు వెంకటాపురం, ఏటూరునాగారం, కన్నాయిగూడెం ,తాడ్వాయి, గోవిందరావు పేట, ములుగు, మంగపేట, కొత్తగూడ, గంగారాం, గూడూరు, ఖానాపూర్, నల్లబెల్లి, నర్సంపేట, వెంకటాపురం(రామప్ప) మండలాల మోబిలైజర్స్ ఉన్నారు. 

Advertisement
Advertisement