Advertisement
Advertisement
Abn logo
Advertisement

దాశరథి కృష్ణమాచార్యకు మంత్రి ఎర్రబెల్లి నివాళి

హైదరాబాద్: తెలంగాణ వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించి, అనాటి తెలంగాణలో ఉద్యమ చైతన్యం కలిగించిన గొప్ప వైతాళికుడు, కవి, ఉద్యమకారుడు దాశరథి కృష్ణమాచార్యులు అని అన్నారు. అగ్నిధార పేరుతో తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన తెలంగాణ సాహితీ సౌరభం, గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్య అని తెలిపారు. 


దాశరథి సాహిత్య రంగంలో చేసిన సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ ఆయన పేరున అవార్డును అందించడం ఆయన పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ కి ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. తెలంగాణ వైతాళికులను గౌవరవించుకోడం మన కర్తవ్యమని, నేటి యువత దాశరథి ని ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు.దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి కూడా ఘనంగా నివాళుర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించి, తెలంగాణలో ఉద్యమ చైతన్యం కలిగించిన గొప్ప తెలంగాణ వైతాళికుడు, కవి, ఉద్యమకారుడు దాశరథి కృష్ణమాచార్యులు అని అన్నారు. 

Advertisement
Advertisement