భారీ చలిలోనూ కేంద్ర మంత్రి వద్ద రైతాంగం కోసం ఒత్తిడి చేశాం

ABN , First Publish Date - 2021-12-24T23:32:34+05:30 IST

ఇంత భారీ చలిలోనూ రైతాంగం కోసం మేము కేంద్ర మంత్రి దగ్గర ఒత్తిడి చేశామని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు

భారీ చలిలోనూ కేంద్ర మంత్రి వద్ద రైతాంగం కోసం ఒత్తిడి చేశాం

న్యూఢిల్లీ: ఇంత భారీ చలిలోనూ రైతాంగం కోసం మేము కేంద్ర మంత్రి దగ్గర ఒత్తిడి చేశామని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు తప్పుడు సంకేతాలు ఇచ్చారు.మేము పూర్తిగా వివరించామని చెప్పారు.శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. తెలంగాణలో బిజెపి నేతలు వ్యవహారాన్నిపీయూష్ కు చెప్పామని అన్నారు.ఇది వాళ్ళ తప్పు అని నిరూపించాం.ఎఫ్ సి ఐ వాళ్ళు ఖాళీ చేయడం లేదు.రైల్వే వాళ్ళు తీసుకోవడం లేదు అని చెప్పాము.బీజెపి నేతలు కిషన్ రెడ్జ్, బండి సంజయ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఆరోపించారు.


ఇది రాజకీయం కాదు. రైతాంగం సమస్య.దీనికి మద్దతు తెలపాల్సింది పోయి కేంద్రానికి తప్పడు సమాచారం ఇచ్చారని అన్నారు.లేఖలు ఇవ్వడానికి అడ్డుపడుతున్నట్లు అనిపిస్తోంది.మాకు తెలియకుండా లేఖలు ఇస్తారా? మేము అపుతాము అని బీజేపీ నేతలు మాట్లాడినట్లు తెలిసింది.ఎంత సిగ్గు చేటు.. దీన్ని వదిలిపెట్టము.దేశ రైతాంగానికి వ్యతిరేకంగా బిల్లుతెచ్చి వెనక్కి తీసుకున్నారు.క్షమాపణలు కూడా చెప్పారు. మళ్ళీ రైతుల అంశంలో ఎందుకు రాజకీయాలని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. 60 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వచ్చిన ధాన్యంతో ఇండియా గేట్ వద్ద కూర్చుంటామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-24T23:32:34+05:30 IST