నియంత్రిత సాగు ప్రయోజనకరం

ABN , First Publish Date - 2020-05-28T11:10:42+05:30 IST

నియంత్రిత సాగు రైతులకు ఎంతో ప్రయోజనకరమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్‌రావు

నియంత్రిత సాగు ప్రయోజనకరం

అన్నదాతలకు అధిక లాభాలు  

రైతులను రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం       

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


భూపాలపల్లి రూరల్‌, మే 27: నియంత్రిత సాగు రైతులకు ఎంతో ప్రయోజనకరమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్‌రావు అన్నారు. వానాకాలం(2020) నియం త్రిత సాగు విధానంపై కలెక్టర్‌ అబ్దుల్‌ అజీ మ్‌ అధ్యక్షతన భూపాలపల్లిలోని ఇల్లందుక్లబ్‌ లో బుధవారం జరిగిన అవగాహన సదస్సు లో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు లాభసాటిగా చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అన్నారు. నిత్యం అవసరం ఉన్న పంటలను పండించడం ద్వారా మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందన్నారు. నియంత్రి త సాగులో సన్న రకం వరి, తెలంగాణ సోనా పంటలుఎంతో ప్రయోజనకరమన్నారు.


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోపత్తి, మిర్చి పం టలు అధికంగా పండుతాయని, వీటికి మార్కెట్‌లో ఎంతో ఆదరణ ఉందని తెలిపారు. రైతు ల అభ్యున్నతికి కేసీఆర్‌ అహర్నిషలు కృషి చే స్తున్నారని అన్నారు.మూడు నెలలుగా ముఖ్య మంత్రి కేసీఆర్‌ వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్య వసాయ నిపుణులతో చర్చలు జరుపుతూ నియంత్రిత పంటల విధానానికి రూపకల్పన చేశారన్నారు. దేశంలోనే నాణ్యమైన పంటలు తెలంగాణలో పండుతున్నాయన్నారు. కరోనా తో రాష్ట్ర ఆదాయం రూ.15వేల కోట్లు రావాల్సి ఉండగా, రూ.110కోట్లు మాత్రమే వస్తోందన్నా రు. అధికారుల జీతాల్లో కోత పెట్టినా  రైతుల సంక్షేమానికి లోటు రానివ్వలేదని స్పష్టం చేశారు. వారికిఇబ్బంది కలగకుండా రూ.7వేల కోట్లు అప్పు తెచ్చి రైతుబంధు పథకం అమలు చేశామన్నారు.


రూ.25వేల లోపు రుణం ఉన్న రైతులందరికీ రూ.1,200 కోట్లతో రుణమాఫీ చేశామని తెలిపారు. రూ.30వేల కోట్లు అప్పు తెచ్చి ధాన్యం, మొక్కజొన్నలు కొన్నామ ని మంత్రి చెప్పారు.  ధాన్యం నిల్వ చేయడాని కి  ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రూ.30కోట్ల వ్యయంతో 25మెట్రిక్‌ టన్నుల గోడౌన్లు నిర్మిస్తున్నామని వివరించారు. వ్యవసాయ శాఖ లో ఖాళీ పొస్టులను త్వరలోనే భర్తీచేస్తామని, అన్ని క్లస్టర్లలో  రైతు వేదికలను మూడు నెలల్లోగా నిర్మిస్తామని అన్నారు. 


భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రైతులకు పంట మార్పిడిలో భాగంగా ఆయిల్‌ఫామ్‌, మిర్చి, పత్తి, పల్లీ, తె లంగాణ సోనా రకాల పంటలను సాగు చే యాలన్నారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రైతులు వేసే పంటలకు, రైతుబంధు పథకానికి ముడిపెట్టొద్దని ప్రభుత్వా న్ని కోరారు. భూసార పరీక్షలు నిర్వహించి  ఎలాంటి పంటలు వేయాలో గ్రామసభల ద్వా రా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సదస్సులో జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, జేసీ స్వర్ణలత, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, అదనపు కలెక్టర్‌ రాజావిక్రమ్‌రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ శోభ, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరాణి, డీఏవో నగేష్‌, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు, తహసీల్దా ర్లు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-28T11:10:42+05:30 IST