Abn logo
Sep 10 2021 @ 19:05PM

చాకలి ఐలమ్మ.. మా ప్రాంతంలో జన్మించడం అదృష్టం: ఎర్రబెల్లి

జనగామ: చాకలి ఐలమ్మ వంటి గొప్పవారు.. తమ నియోజకవర్గంలో జన్మించడం అదృష్టమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన పాలకుర్తిలో చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం పాలన, విస్నూరు దేశ్‌ముఖ్‌కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ.. అని కొనియాడారు. నాడు వారు చేసిన ఉద్యమమే, తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని చెప్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని గుర్తుచేశారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ చూపుతూ నాటి దేశ్‌ముఖ్‌లు, రజాకార్ల గుండెల్లో భయం పుట్టించిందని తెలిపారు. ఓవైపు సాయుధ పోరాటం చేస్తూనే.. మరోవైపు ఉద్యమకారులకు అమ్మలాగా అన్నం పెట్టి ఆదరించిన మహనీయురాలు.. ఐలమ్మ అని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు.