రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేక‌ర‌ణ చేప‌ట్టాలి: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-11-08T00:49:06+05:30 IST

వ‌రి ధాన్యం సేక‌ర‌ణ‌లో ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు చెప్పారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేక‌ర‌ణ చేప‌ట్టాలి: ఎర్రబెల్లి

హన్మకొండ: వ‌రి ధాన్యం సేక‌ర‌ణ‌లో ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు చెప్పారు. ఆదివారం హ‌నుమ‌కొండ క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో రాష్ట్ర రైతుబంధు స‌మితి అధ్యక్షులు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, పెద్ది సుధ‌ర్శ‌న్‌రెడ్డి, వ‌రంగ‌ల్ జెడ్పీ చైర్మ‌న్ గండ్ర జ్యోతిల‌తో క‌లిసి వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ జిల్లాల్లో వానాకాలం వ‌రి ధాన్యం సేక‌ర‌ణ‌కు చేప‌ట్టిన చ‌ర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై జిల్లా క‌లెక్ట‌ర్లు డా.బి.గోపి, రాజీవ్‌గాంధి హ‌నుమంతు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌, వ్య‌వ‌సాయశాఖ‌, గ్రామీణాభివృద్ది శాఖ‌ల అధికారులతో స‌మీక్ష చేశారు. ఈ సంధ‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ గ‌త సీజ‌న్‌లో ఎదురైన అనుభ‌వాలు, ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా అన్ని ఏర్పాట్లను చేప‌ట్టాల‌ని సూచించారు. 


దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్ట‌ని రీతిలో రైతులు పండించిన పంట‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. సీఎం కేసిఆర్ వ్య‌వ‌సాయ రంగం అభివృద్దికి ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి సాగునీరు అందించడం వల్ల ధాన్యం ఉత్ప‌త్తి ఘననీయంగా పెరిగింద‌న్నారు. ధాన్యం సేక‌ర‌ణ‌లో కేంద్రం ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల పేరుతో ఇబ్బందుల‌కు గురి చేస్తున్నా రైతుల కోసం ప్ర‌భుత్వం ఎన్నిఇబ్బందులు ఎదురైనా ధాన్యం సేక‌రిస్తుంద‌న్నారు. వ‌రంగ‌ల్ జిల్లాలో ఈ వానాకాలం 3ల‌క్ష‌ల 15వేల 189, హ‌నుమ‌కొండ జిల్లాలో 3ల‌క్ష‌ల 61వేల 35 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం దిగుబ‌డి వ‌స్తుంద‌ని అంచ‌నా వేసిన‌ట్లు చెప్పారు. 


వ‌రంగ‌ల్ జిల్లాలో 180, హ‌నుమ‌కొండ జిల్లాలో 150 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్ర‌తి కొనుగోలు కేంద్రంలో రైతుల‌కు అవ‌స‌ర‌మైన త్రాగునీరు, శామియానాలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ప్ర‌తి మండ‌లానికి ఒక ప్ర‌త్యేక అధికారిని నియ‌మించి ప్ర‌తిరోజు స‌మీక్ష జ‌ర‌పాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. రైతులు అమ్మ‌కాల కోసం కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించ‌కుండా వ‌రికోత స‌మ‌యాన్ని అనుస‌రించి టోకెన్ లు అంద‌జేసి, కొనుగోళ్లు చేప‌ట్టాల‌న్నారు. ధాన్యం ర‌వాణా కోసం వాహానాల కొర‌త లేకుండా ర‌వాణా, పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. ధాన్యం సేక‌ర‌ణ పూర్తి అయ్యేవ‌ర‌కు అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. 

Updated Date - 2021-11-08T00:49:06+05:30 IST