ఉపాధి హామీ నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-17T20:00:24+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని కల్పించే ఉపాధి హామీ పధకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు

ఉపాధి హామీ నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి

హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని కల్పించే ఉపాధి హామీ పధకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి పనుల మీద ఆయన మిషన్ భగీరథ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు.ఈ సమావేశానికి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూపంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.కరోనా నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మరింత  పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.ఉపాధి హామీ నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.పల్లె ప్రగతి ని నిరంతరం నిర్వహిచాలి.గతం లాగే ఈసారి కూడా కరోనా నియంత్రణకు అన్నివిధాలుగా పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది ఫ్రంట్ వారియర్స్ గా పని చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2022-01-17T20:00:24+05:30 IST