కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలి:మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-01-28T23:40:08+05:30 IST

పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారు అందరు ఏమాత్రం అధైర్య పడకుండా వైద్యుల సలహా మేరకు కరోనా కిట్టుల మందులను వాడినట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకుంటారని అయన అన్నారు.

కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలి:మంత్రి ఎర్రబెల్లి

పాలకుర్తి: పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారు అందరు ఏమాత్రం అధైర్య పడకుండా వైద్యుల సలహా మేరకు కరోనా కిట్టుల మందులను వాడినట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకుంటారని అయన అన్నారు. శుక్రవారం సాయంత్రం హన్మకొండ నుండి పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి, తొర్రుర్, పాలకుర్తి, పెద్దవంగర, కోడకండ్ల, దేవరుప్పుల మండలాలొని కరోనా బాధితులతో, అధికారులతో,ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా బాధితుల యోగ క్షేమాలను తెలుసుకొని కరోనా నివారణకు తగు సూచనలు చేశారు. నియోజకవర్గంలో గత మూడు రోజులుగా 1502 మందికి కోవిడ్ టేస్టులు చెయ్యగా అందులో 84 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అయన తెలిపారు.  


కరోనా సోకినా వారు ఇంటివద్దనే ఉండి కరోనా కిట్టులోని మందులను వైద్యుల, ఆరోగ్య సిబ్బంది సలహా మేరకు వాడుతూ హోం హైసొలేషన్ లో ఉండాలని అయన సూచించారు. కరోనా కిట్టులోని మందుల వలన వ్యాధి పూర్తిగా తగ్గుతున్నదని అందువలన దైర్యంగా ఉండి చికిత్స పొందాలని అయన కోరారు. జ్వరం తీవ్రంగా ఉండి శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉండటంతో పాటుగా ఆక్సిజన్ లేవల్స్ పడిపోయినట్లయితే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే చేరాలని ఆయన కోరారు. చికిత్స కోసం సహాయ సహకారాలు అందించడానికి హన్మకొండ లో ఇద్దరు వ్యక్తిగత సిబ్బందిని, హైదరాబాద్ లో మరో ఇద్దరు  వ్యక్తిగత సిబ్బందిని ఎల్లవేళలా అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. కరోనా చికిత్స పొందుతున్నపుడు చాలా నీరసంగా ఉంటుందని అయినప్పటికీ అధైర్య పడకుండా చికిత్స తీసుకుట్లయితే క్రమ క్రమంగా కోలుకుంటారని అయన అన్నారు.


ఈ సందర్బంగా చికిత్స పొందుతున్న వ్యక్తులను పేరు పేరునా పలకరించి భరోసానిచ్చారు. కరోనా బాధితులు తొందరగా కోలుకోవడానికి అందించవల్సిన వైద్య సహాయం గురించి ప్రభుత్వ డాక్టర్లకు, ఆశా వర్కర్లకు, ఏ.ఎన్.ఎం లకు ఇతర వైద్య సిబ్బందికి తగు సూచనలు చేసారు. వైద్యులు,ఆరోగ్య సిబ్బందిలలో చాలా మంది కరోనా వచ్చినను విశ్రాంతి తీసుకోకుండా కరోనా బాధితులకు చికిత్స చేయడం శ్లాఘనీయమని అయన అన్నారు. రాష్ట్రంలో కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడుతున్నదని అయన తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో మొదటి డోస్ వాక్సిన్ తీసుకోని రెండవ డోస్ తీసుకోని వారిఅందరికి వెంటనే వ్యాక్సినేషన్ ఇప్పించాలని అధికారులను, ప్రభుత్వ డాక్టర్లను, ప్రజాప్రతినిధులను మంత్రి కోరారు. అంతేకాకుండా రెండవ డోస్ తీసుకున్న 60 ఏండ్ల పైబడిన వారందికీ కరోనా నివారణ చర్యల్లో భాగంగా బూస్టర్ డోస్ వెయ్యాలని అయన కోరారు.


Updated Date - 2022-01-28T23:40:08+05:30 IST