Abn logo
Jul 23 2021 @ 14:41PM

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద పరిస్థతిపై ప్రజాప్రతినిధుల ఆరా

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తమయ్యారు. వరదలో నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నుంచి తగిన సాయం అందుతుందని వారు భరోసా ఇచ్చారు. ఈ మేరకు  శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ సుధారాణి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రెవిన్యూ, మున్సిపల్ కార్పోరేషన్ అధికారులతో కలిసి పర్యటించారు. వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలను అలాగే హన్మకొండ నయీం నగర్ వద్ద పెద్ద మోరీ ప్రవాహాన్ని పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండి, ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.