Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రారంభోత్స‌వానికి సిద్ధమైన టిఆర్ఎస్‌ పార్టీ కార్యాల‌యం

జనగామ జిల్లా: టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండాలన్న ధ్యేయంతో ప్రతి జిల్లాలో టీఆర్ ఎస్ పార్టీ కార్యాయాల నిర్మాణం ప్రారంభమైంది. కొన్ని జిల్లాల్లలో పార్టీ కార్యాలయాలుపూర్తి కాగా మరికొన్ని జిల్లాల్లో ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి.తాజాగా జనగామ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. పార్టీ అధినేత‌, సీఎం కెసిఆర్, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ల చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు శనివారం పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర‌తి జిల్లాకు పార్టీ కార్యాల‌యంలో భాగంగా జనగామ టీఆర్ఎస్ పార్టీ జల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైందన్నారు. అలాగే ఉమ్మ‌డి జిల్లాలో మిగతా జిల్లాల పార్టీ కార్యాల‌యాలు ప్రారంభోత్స‌వానికి సిద్ధం అవుతున్నాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. ఆయా కార్యాల‌యాల‌ను సీఎం కేసిఆర్, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ల చేతుల మీదుగా ప్రారంభోత్స‌వాలు జ‌రిపిస్తామ‌ని మంత్రి తెలిపారు. పార్టీ కార్యాల‌యాలు ప్రారంభ‌మైతే పార్టీ కార్య‌క‌లాపాల‌న్నీ అందులోనే జ‌రుపుకునే వీలు క‌లుగుతుంద‌న్నారు. పార్టీ శ్రేణుల‌కు కూడా అనుకూలంగా ఉంటుంద‌న్నారు. పార్టీ కార్యాల‌యాలు స‌ర్వాంగ సుంద‌రంగా స‌క‌ల స‌దుపాయాల‌తో నిర్మిస్తున్న‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement