ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది జీతాలు పెంచండి

ABN , First Publish Date - 2020-11-22T09:47:47+05:30 IST

ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలు పెంచాలని కోరుతూ మంత్రి ఈటల రాజేందర్‌కు..

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది జీతాలు పెంచండి

మంత్రి ఈటలకు కార్మిక సంఘాల విజ్ఞప్తి


హైదరాబాద్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలు పెంచాలని కోరుతూ మంత్రి ఈటల రాజేందర్‌కు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ వినతి పత్రం అందజేసింది. 8 ఏళ్లుగా జీతాలు పెరగలేదని, ప్రస్తుతం రూ.9400 మాత్రమే ఇస్తున్నారని, కనీస వేతన చట్టం ప్రకారం రూ.25 వేలు చెల్లించాలని కోరారు. పారిశుధ్య, రోగి సంరక్షణ, భద్రత సిబ్బందికి పండగ, జాతీయ, అర్జిత సెలవులు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పదేళ్ల సర్వీసు ఉన్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని విన్నవించారు.

Updated Date - 2020-11-22T09:47:47+05:30 IST