బీసీల సమగ్ర అభివృద్ది, అభ్యున్నతికి కేసీఆర్ సర్కార్ కృషి:Gangula kamalakar

ABN , First Publish Date - 2022-06-01T20:32:30+05:30 IST

బీసీలు వెనుకబడ్డవారు కాదని, గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో బీసీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు.

బీసీల సమగ్ర అభివృద్ది, అభ్యున్నతికి కేసీఆర్ సర్కార్ కృషి:Gangula kamalakar

హైదరాబాద్: బీసీలు వెనుకబడ్డవారు కాదని, గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో బీసీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు. బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నిర్వహించిన సాంస్క్రుతిక నృత్య పోటీల్లో గెలిచిన విధ్యార్థులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి అవార్డులు అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో రాష్ట్రం లో విద్యా, ఉపాధి రంగాలతో పాటు సాంస్కృతిక కళారంగంలో బిసీ విద్యార్థులు ముందంజలో ఉన్నారన్నారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను గుర్తించి వారిని నాసా వరకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. 


రాష్ట్ర ఏర్పాటుకు ముందు 19 గురుకులాలు ఉంటే నేడు 281కి పెంచుకున్నామని వీటికి అదనంగా బీసీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 700 హాస్టళ్లను అత్యుత్తమ నాణ్యతతో కూడిన బోజన, వసతులతో నిర్వహిస్తున్నామన్నారు. 420 ఫ్రీ మెట్రిక్ హాస్టళ్లు, 280 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 46,457 మంది ఉంటున్నారని వీరిలో విద్యతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, క్రియేటివ్ థింకింగ్, కెపాసిటీ బిల్డింగ్, అంతర్గత నైపుణ్యాల్ని వెలికితీసి ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు వారి సర్వతోముఖాబివ్రుద్ది కోసం చరిత్రలోనే తొలిసారిగా సాంస్క్రుతిక పోటీలు నిర్వహించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు.


బీసీలకు వేల కోట్లని పీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్పుల రూపంలో అందజేస్తున్నారని, వెనుకబడిన బిడ్డలు సైతం సగర్వంగా తలెత్తుకొని విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకొనేలా మహాత్మా జ్యోతీబాపూలే పేరుమీద ఇరవై లక్షల్ని ఒక్కో మెరికలైన బీసీ విద్యార్థికి అందజేస్తున్నారన్నారు. ఒకేసారి 80వేల ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయడమే కాకుండా బీసీలకు వయోపరిమితి సడలింపులిచ్చి అత్యుత్తమ శిక్షణ అందించేందుకు బీసీ స్టడీ సర్కిళ్లు కృషి చేస్తున్నాయని, ఇప్పటికే గ్రూప్ 1 కోచింగ్ ప్రారంభించామని, ఎస్సై, కానిస్టేబుల్ వంటి ఉద్యోగాల కోసం నియోజకవర్గానికి ఒక స్టడీ సెంటర్ని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దన్నారు, దాదాపు లక్షమందికి పైగా అభ్యర్థులకు అత్యుత్తమ కోచింగ్ని ఇస్తామన్నారు. 

Updated Date - 2022-06-01T20:32:30+05:30 IST