రామ్‌లీలా, లేజర్‌ షోలకు స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2020-10-25T07:01:20+05:30 IST

నగరంలోని అంబేద్కర్‌ స్టేడి యంలో ఆదివారం సాయంత్రం దసరా వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రామ్‌లీలా రావణాసురిడి దహనంతో పాటు లేజర్‌షో, స్ర్కీన్‌షో, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పా ట్లు పూర్తయినట్లు

రామ్‌లీలా, లేజర్‌ షోలకు స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి

 మేయర్‌ సునీల్‌రావు  

 పరిశీలించిన మంత్రి గంగుల కమలాకర్‌


 కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 24: నగరంలోని అంబేద్కర్‌ స్టేడి యంలో ఆదివారం సాయంత్రం దసరా వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రామ్‌లీలా రావణాసురిడి దహనంతో పాటు లేజర్‌షో, స్ర్కీన్‌షో, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పా ట్లు పూర్తయినట్లు నగర మేయర్‌ వై.సునీల్‌రావు తెలిపారు. శనివారం ఆయన స్టేడియంలో చేపడుతున్న దసరా వేడుకల పనులను పరిశీలించి పలు సలహాలు, సూచనలు చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సూచనల మేరకు ఇకపై ప్రతి యేడాది దసరా రోజున నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రామ్‌లీలా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న రామ్‌లీలా కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశామని, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అయితే కరోనా వైరస్‌ పూర్తిగా తగ్గలేదని, ప్రజలు విధిగా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పా టిస్తూ వేడుకల్లో పాల్గొనాలని మేయర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

 

కరీంనగర్‌ కల్చరల్‌ : నగరంలోని అంబేద్కర్‌ స్టేడియంలో ఆదివారం సాయంత్రం దసరా వేడుకల్లో భాగంగా జరుగ నున్న రామ్‌లీలా రావణాసురిడి దహనంతో పాటు లేజర్‌షో ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావుతో కలిసి పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-10-25T07:01:20+05:30 IST